జగన్ కేసుపై మాట్లాడడం తగదు: సిఎం కిరణ్ కుమార్

పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులపై తాను కేంద్ర మంత్రి జయంతీ నటరాజన్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. వేయి కోట్ల రూపాయలతో స్త్రీనిధి ఏర్పాటు చేయాలని కోరినట్లు, దాని వల్ల మహిళలు మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా ఉంటారని చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 7,300 టన్నుల ఎర్రచందనం నిల్వలన్నాయని, ఎర్రచందనం ఎగుమతికి అనుమతి కోరారని ఆయన అన్నారు. రాష్ట్రానికి రెండు బెటాలియన్ల బలగాలను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు ఆయన తెలిపారు. దీపం పథకం కింద ఆరు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉందని, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెసుదే విజయమని ఆయన అన్నారు. ఏ ఎన్నికల్లోనైనా గెలిచే సత్తా, బలం కాంగ్రెసుకు ఉన్నాయని ఆయన అన్నారు. 2014వరకు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన అన్నారు. ఆ తర్వాత కూడా కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications