తెలంగాణ: కెసిఆర్ సేఫ్ జోన్, ఇతరులకు నో ఎంట్రీ

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకత్వాలు తమ తమ తెలంగాణ ప్రాంత నాయకులను ముందుకు తోస్తున్నప్పటికీ వారికి ప్రజల్లో అంతగా ఆదరణ లభించడం లేదు. తెలంగాణపై నాయకత్వాల తీరు ఆ నాయకులకు విశ్వసనీయతను పెంచడం లేదు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ జెఎసిలకు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం తెలంగాణ నేతలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అలాగే, రాజీనామాల విషయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకుల తీరు కూడా ప్రజలకు అనుమానాలు కలిగిస్తోంది. కెసిఆర్‌ను ఎదుర్కోవడానికి ఇతర సంఘాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు.
చంద్రబాబు, బొత్స సత్యనారాయణ, వైయస్ జగన్, చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రలో పోటీ పడాల్సిందే. దీంతోనే ఆ నాయకులంతా సీమాంధ్రలోనే పర్యటిస్తున్నారు తప్ప తెలంగాణలో పర్యటించేందుకు అంతగా ముందుకు రావడం లేదు. తెలంగాణ సమస్య పరిష్కారమైతే తప్ప వారి సమస్య తీరే పరిస్థితి లేదు.












Click it and Unblock the Notifications