బొత్సపై విరుచుకుపడిన జగన్ పార్టీ నాయకులు

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగారు. మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి పట్టిన గతే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పడుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు జోస్యం చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించి, సీఎం పదవిని పొందడానికి బొత్స ప్రయత్నిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద జగన్ పేరు చెప్పుకొని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్సలు బతుకుతున్నారని ఆయన విమర్శించారు.. సీఎం, బొత్సల మధ్య నెలకొన్న అంతర్గత పోరుతో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని ఆయన అన్నారు.

పీసీసీ అధ్యక్షుడు బొత సత్యనారాయణ వ్యాఖ్యలపై రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. వారసత్వ రాజకీయాలకు కేంద్రబిందువు కాంగ్రెస్ పార్టీయేనని ఆయన మంగళవారం అనంతపురంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకూ అందరూ రాజకీయ వారసులేనని కాపు రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. బొత్స ఒక అవినీతిపరుడని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బొత్స కుటుంబంలో ఎంతమందికి పదవులున్నాయో గుర్తు చేసుకోవాలని రామచంద్రారెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+