పేరెత్తకుండా జగన్‌కు బొత్స సత్తిబాబు చురకలు

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అధికారం వద్దని అనుకుంటుంటే రాష్ట్రంలో కొందరు అధికారం కోసం తాపత్రయ పడుతున్నారని విమర్శించారు. ఒక్కరికైనా పెన్షన్ ఆగిందని చెబితే మేం సిగ్గుతో తలదించుకుంటామన్నారు. త్యాగమంటే ఏమిటో రాహుల్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. తొమ్మిదేళ్లు రైతుల గురించి పట్టించుకోని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. జలయజ్ఞస్ఫూర్తి ప్రధాత, కిరణ్, బోత్స అత్యంత సన్నిహితులు, ఇందిరమ్మ పాలన అంటే ఎలా ఉంటుందో వైయస్ చేసి చూపించారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. వైయస్ జలయజ్ఞ స్ఫూర్తి ప్రధాత అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైయస్‌కు అత్యంత సన్నిహితులు అన్నారు. మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెసు పార్టీలోకి తీసుకు రావాలన్న ఆకాంక్ష వైయస్‌దే అన్నారు. వైయస్ ఆకాంక్షలు ఒక్కటొక్కటిగా నెరవేరుతున్నాయన్నారు. అయితే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న వైయస్ ఆకాంక్ష మిగిలి ఉందన్నారు. ఆయన ఆకాంక్షను నిజం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. రాహుల్‌ని ప్రధానిని చేయాల్సిన బాధ్యత బొత్స, కిరణ్‌లపై ఉందన్నారు. అనంతరం బొత్స లగడపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 18 అడుగుల వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications