బొత్స బహిరంగ సభలో వైయస్ జగన్ వర్గం రగడ

అయినప్పటికీ సుమారు వంద నుండి రెండు వందల మంది వైయస్సార్సీ కార్యకర్తలు మహిళలతో సహా బహిరంగ సభలో కూర్చున్నారు. మధ్యలో బొత్సకు, కాంగ్రెసుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బొత్స గో బ్యాక్ అంటూ అరిచారు. కుర్చీలను కాంగ్రెసు కార్యకర్తల పైకి విసిరారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొని వైయస్సార్సీ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో బొత్సతో పాటు మంత్రులు కన్నా లక్ష్మి నారాయణ, గల్లా అరుణ కుమారి, డొక్కా మాణిక్య వరప్రసాద్, వట్టి వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications