రాయపాటి అక్రమాలు రుజువు చేస్తా: కెసిఆర్ సవాల్

K Chandrasekhar Rao
హైదరాబాద్: చైనాకు పొగాకు ఎగుమతిలో కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అక్రమాలను తాను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, రాయపాటి సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. ఖర్చులు తామే భరిస్తామని, దమ్ముంటే చైనాకు రావాలని ఆయన రాయపాటి సాంబశివరావును సవాల్ చేశారు. సికింద్రాబాదులోని హరిహర కళాభవన్‌లో బుధవారం సాయంత్రం జరిగిన పాలిటెక్నిక్ జెఎసి గర్జనలో ఆయన ప్రసంగించారు. సీమాంధ్ర నాయకులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. సీమాంధ్ర నాయకులు రంగులు మార్చడం చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

సీమాంధ్ర నాయకుల బెదిరింపులకు తాము భయపడబోమని ఆయన అన్నారు. మంత్రిగా ఉన్న శైలజానాథ్ పద్దతి తెలుసుకుని మాట్లాడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన పది వేల మంది ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, తమ గన్‌మెన్, పిఎల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని, ట్యాపింగులకూ టోపింగులకు తాము బెదరబోమని ఆయన అన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణవారికి న్యాయం జరగదని ఆయన అన్నారు. 11 ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణలో ఐక్యత వచ్చిందని, ఈ ఐక్యతే తమను కాపాడుతుందని ఆయన అన్నారు.

ఉద్యోగ నియామాకల్లో తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి హయాంలో జారీ అయిన జివో గానీ ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో జారీ అయిన జీవో గానీ అమలు కాలేదని ఆయన చెప్పారు. గిర్‌గ్లానీ వంటి కమిటీల సిఫార్సులు కూడా అమలు కాలేదని ఆయన చెప్పారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు న్యాయం జరగదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+