అన్నీ వాయిదాలే: దిక్కు తోచని స్థితిలో రాష్ట్ర కాంగ్రెసు?

Botsa Satyanarayana and CM Kirankuamar Reddy
హైదరాబాద్: తెలంగాణ సమస్య ఓ వైపు, వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమస్య మరోవైపు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సమస్యల్లోంచి బయటపడినట్లుగా కనిపించడం లేదు. ప్రభుత్వానికి, పార్టీకి కొత్త సారథులు వచ్చినప్పటికీ పార్టీలో, ప్రభుత్వంలోనూ పరిస్థితి అంత ఆశించినంతగా ఏమీ కనిపించడం లేదు. పార్టీలో ఉత్సాహం నింపాలన్న పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు ఫలించినట్లుగా కనిపించడం లేదు. పిసిసి కొత్త కార్యవర్గం ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటివి ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలలో నిరుత్సాహం చోటు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినా మంత్రివర్గంలో వారికి అవకాశం కల్పించలేని పరిస్థితిలో కాంగ్రెసు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ మధ్య సఖ్యత కూడా అంతంతగానే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడి గ్రూపు రాజకీయాలు మరోసారి బాగా తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోటీ పైనా వీరిద్దరిలో విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పోటీ చేయకుండా ఉంటే సెంటిమెంటును గౌరవించినట్లవుతుందని బొత్స అభిప్రాయపడుతుండగా, కానీ కిరణ్ మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నారట. తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు సైతం పోటీలో ఉండవద్దని కోరుతున్నప్పటికీ అధిష్టానం ససేమీరా అనడంతో పోటీ తప్పడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి సిఎం అయ్యాక సొంత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. బొత్స సైతం తన ఇష్టానుసారంగా పిసిసి, డిసిసి కార్యవర్గాలనేర్పరచుకోవాలని చూస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నాలు నెరవేరటం లేదు. జగన్ పార్టీకి దూరం కావడంతో పలుచోట్ల కాంగ్రెసు శ్రేణులు పార్టీకి దూరమయ్యారు. ఇక్కడ కొత్తగా బాధ్యుల్ని గుర్తించడంపై ప్రత్యేక శ్రద్ధ కొరవడింది. ఇందుకు బొత్స చేస్తున్న ప్రయత్నాలూ ఫలిస్తున్నట్లుగా కనిపించడం లేదు.

ఫలితంగా పార్టీలో పలుచోట్ల ఎవరికి వారే అన్నా విధంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సహకార ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా పార్టీ శ్రేణుల్లో ఉన్న గందరగోళంలో కాంగ్రెసు ఎన్నికలకు వెనుకడుగు వేస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ చాలాకాలంగా లేక పోవడంతో సిఎం సమక్షంలోనే పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల టిటిడి పాలకమండలిని మాత్రమే కొత్తగా నియమించారు. కీలకమైన పదవులు చాలా ఉన్నాయి. వాటన్నింటి పైన గత ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు వైయస్ హయాంలో తన వారికి పదవులు కేటాయించుకున్నారని ఇప్పటికైనా పార్టీ కోసం పని చేసే వారికి ఇవ్వాలని పలువురు నేతలు బహిరంగంగానే కోరుతున్నారు. ఇక ప్రజారాజ్యం శాసనసభ్యులకు మంత్రివర్గంలో చోటు అంశం అలాగే ఉండిపోగా, శాఖలపై మంత్రుల అసంతృప్తి మొదటి నుండి కొనసాగుతూనే ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+