రైళ్లను తాకిన తెలంగాణ సమ్మె సెగ, ఆటోలూ బంద్

సికింద్రాబాద్-నిజాముద్దీన్, సికింద్రాబాద్- యశ్వంత్ పూర్ గరీబ్థ్,్ర హైదరాబాద్-ముంబై, సికింద్రాబాద్- పాట్నా, హైదరాబాద్-న్యూఢిల్లీ రైళ్లు రద్దయ్యాయి. వాటితో పాటు పలు రైళ్లను దారి మళ్లించారు. 222 ఎంఎంటిఎస్ సర్వీసులు, 102 డిఎంహెచ్‌యు సర్వీసు లనూ రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అన్ని ప్యాసింజర్ రైళ్లనూ రద్దు చేశారు.అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా జరుగుతోన్న సకల జనుల సమ్మెలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రినుంచి ఆటోలు సమ్మెలో పాల్గొననున్నాయి. 24, 25 తేదీల్లో ఆటోలను నిలిపివేయాలని ఆటో డ్రైవర్ల యూనియన్లు నిర్ణయించాయి.












Click it and Unblock the Notifications