నెలాఖరున మంత్రి పదవికి జానా రెడ్డి రాజీనామా?

K Jana Reddy
హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు సీనియర్ రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవికి ఆయన ఈ నెలాఖరున రాజీనామా చేయవచ్చుననే వార్తలు వస్తున్నాయి. అయితే, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయకపోవచ్చునని అంటున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ నెల 25వ తేదీన తెలంగాణ అంశాన్ని తేల్చాలని కోరడానికి కాంగ్రెసు తెలంగాణ నాయకులతో పాటు ఆయన కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన 25వ తేదీ సాయంత్రం స్వదేశానికి రావచ్చునని అంటున్నారు. ఇతర ముఖ్య నాయకులు కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ స్థితిలో ఈ నెలాఖరున తెలంగాణపై పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెలాఖరున పార్టీ అధిష్టానం ఏమీ తేల్చకపోతే రాజీనామా చేయాలని జానా రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది వరకే తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి తాను ఆమరణ నిహారారదీక్షకు దిగుతానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జానా రెడ్డి కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+