రైల్ రోకో: తెలంగాణలో స్తంభించిన రవాణా వ్యవస్థ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ తెలంగాణవాదులు శనివారం ఉదయమే రైలు పట్టాల మీదికి వచ్చారు. సికింద్రాబాదు, కాజీపేట, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాదులో ఆటోలు కూడా బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణలో బస్సులు నడవడం లేదు. పెట్రోల్ బంకులు బంద్ పాటిస్తున్నాయి. మద్యం షాపులను కూడా తెరవడం లేదు. కాగా, తెలంగాణలో సకల జనుల సమ్మె శనివారంనాడు 12వ రోజుకు చేరుకుంది. రైల్ రోకోను విజయంవంతం చేయడానికి ఆందోళనకారులు పట్టాలపైనే వంటావార్పూ పెట్టారు.












Click it and Unblock the Notifications