పైన ఒకరితో కింద ఒకరితో కాపురం: టిడిపి నేతలు

రాష్ట్ర విభజనపై ఏ అఖిలపక్ష సమావేశాలకు తాము వెళ్లమని మరో నేత యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. తమ పార్టీలోని రెండు ప్రాంతాల నేతలు ఇంతకుముందే సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి సైతం అప్పుడు పార్టీలోనే ఉన్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ నివేదికలపై ఏ నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంలో తప్పు లేదని వారి ప్రాంతీయ పరిస్థితిలకు అనుగుణంగా రాజీనామా చేశారన్నారు.












Click it and Unblock the Notifications