బొత్స ప్రయత్నం విఫలం: కదలని బస్సులు

అయితే వారి ప్రకటనపై తెలంగాణ ఎన్ఎంయు ఫోరం నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులను కదలనివ్వమని హెచ్చరించారు. అయితే కొందరు ఒప్పుకున్న నేపథ్యంలో పాక్షికంగానైనా బస్సులు తిరగే ఆస్కారముందని ప్రభుత్వం భావించింది. కానీ మంగళవారం రహదారులు ఎప్పటిలాగే కనిపించాయి. బస్సులు రోడ్డెక్క లేదు. ఎన్ఎంయు ప్రధాన నేతల సమ్మె విరమణకు తెలంగాణలోని కార్మికులెవరూ స్పందించలేదు. విధుల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు వచ్చినట్లుగా కనిపించడం లేదు. అందుకే సమ్మె విరమిస్తున్నట్లు ఎన్ఎంయు ప్రకటించినప్పటికీ తెలంగాణ ప్రాంతాల్లో బస్సులు రోడ్డెక్కలేదు.












Click it and Unblock the Notifications