ఆన్‌లైన్ బిజినెస్ పేరుతో కోట్లకు టోకరా, ఫిర్యాదు

ప్రొఫెక్ సంస్థ యజమాని శ్రీనివాస్ ఇచ్చిన చెక్కులు చెల్లలేదు. దానిపై అడిగితే వ్యాపారం సరిగా సాగలేదని, నష్టాలు వచ్చాయని శ్రీనివాస్ చెప్పినట్లు పెట్టుబడుదారులు ఫిర్యాదు చేశారు. గత 9 నెలలుగా శ్రీనివాస్ ఎవరికీ కమిషన్ ఇవ్వలేదు. తాను డబ్బులు ఇవ్వలేనని శ్రీనివాస్ చేతులెత్తేశాడు. దీంతో పెట్టుబడిదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications