కిరణ్ వైఖరితో జగన్ వర్గ ఎమ్మెల్యేల ఇబ్బందులు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యూహం ఫలించినట్లే కనిపిస్తోంది. జగన్ పంచన చేరిన తమ పార్టీ శాసనసభ్యుల స్థానంలో ఇతరును ఇంచార్జులుగా నియమించి పార్టీని కాపాడుకోవడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు చెక్ చెప్పాలని కాంగ్రెసు భావించింది. ఇందులో భాగంగా కిరణ్, బొత్స ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. వారి ద్వారానే పలు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీంతో జగన్ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నట్లుగా వాదనలు వినవస్తున్నాయి.

బుధవారం నుండి ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమం ద్వారా వారు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అయితే ఇప్పుడు జరిగే రచ్చబండలో జగన్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వకుండా స్థానిక మంత్రులే కార్యక్రమాన్ని చక్కబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లోకి బాగా వెళుతున్న రచ్చబండ కార్యక్రమం విషయంలో తమను దూరంగా పెడతారనే విషయాన్ని జగన్ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్యామ్నాయంగా నియమించిన ఇంచార్జులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. తమను దూరం పెట్టే అంశంపై జగన్ ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+