తప్పును వైయస్ ప్రభుత్వంపైకి నెడుతున్న రాజగోపాల్

గాలి జనార్దన్ రెడ్డి తనపై ఏ విధమైన ఒత్తిడి పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. అప్పటి గనుల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి కూడా ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గురయ్యారని ఆయన చెప్పారు. మైనింగ్ కాంట్రాక్టర్ శశికుమార్ చేసిన ఆరోపణల్లో ఏ విధమైన వాస్తవం లేదని ఆయన అన్నారు. తాను ఒక్క పైసా లంచం అడగలేదు, తీసుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని గనులను కాపాడడంలో తాను ప్రధాన పాత్ర పోషించానని ఆయన చెప్పారు. రాష్ట్రానికి యేటా 300 కోట్ల రూపాయల రెవెన్యూ సమకూరేలా తాను కృషి చేశానని ఆయన చెప్పారు. గనుల లీజుకు దరఖాస్తు చేసుకున్నవారిలో కొండారెడ్డి 15వ వ్యక్తి అని ఆయన అన్నారు. గనుల లీజు విషయంలో పరిశ్రమలు పెట్టేవారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రభుత్వ ఉద్దేశం వల్ల గాలి జనార్దన్ రెడ్డికి లీజు దక్కినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications