గాలి పిఎ అలీఖాన్ ప్రాణాలకు ముప్పు?

అలీఖాన్ 2010 మే 13వ తేదీన పాస్‌పోర్టు పొందాడు. అక్రమ మైనింగ్‌లో అలీఖాన్ ముఖ్యమైన లింక్ అని సిబిఐ భావిస్తోంది. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన అలీఖాన్ బళ్లారికి చెందినవాడు. ఖాన్ దేవీ ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీని స్థాపించాడు. అది గాలి జనార్దన్ రెడ్డి బినామీ కంపెనీ అని సిబిఐ భావిస్తోంది. దీంతో పాటు మరో కంపెనీ ఆర్‌కె మైనింగ్ కర్ణాటకలో ఇతర గనులకు కంట్రాక్టులను సాధించి పెట్టింది. దేవీ ఎంటర్‌ప్రైజెస్ చెల్లింపులు జరుపుతూ వచ్చింది. గత ఐదేళ్లుగా ఖాన్ గాలి జనార్దన్ రెడ్డి వద్ద పనిచేస్తున్నాడు. గతంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు అలీఖాన్ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అధికారులకు చెల్లించిన ముడుపుల వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications