బాబు, అవిశ్వాసం లక్ష్యంగా జగన్ వర్గం మాటల దాడి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంటే చంద్రబాబు భయపడుతున్నారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ పార్టీయే గెలుస్తుందని అదే భయం బాబును వెంటాడుతోందన్నారు. ప్రభుత్వం పాలించే హక్కు కోల్పోయిందన్నారు. టిడిపి అవిశ్వాసం తీర్మానం పెట్టే అవకాశమున్నా వినియోగించుకోవడం లేదన్నారు. దాదాపు వందమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం రెండున్నరేళ్లు ఎలా ఉంటుందన్నారు. బాబు కిరణ్ ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలన్నారు.
జగన్‌పై విష ప్రచారానికి పూనుకున్న యెల్లో మీడియా రాతలను రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. ఆయన రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అన్న నినాదంతో జిల్లా రూరల్ నియోజకవర్గంలో సోమవారం పాదయాత్ర ప్రారంభించారు. ఇది మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.












Click it and Unblock the Notifications