మాయావతిని చూసి బుద్ధి తెచ్చుకో: సిఎంకు వినోద్

తెలంగాణ కాంగ్రెసు స్టీరింగ్ కమిటీకి విలువలు లేవని ఇటీవలే టిఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెసు శాసనసభ్యుడు రాజయ్య విమర్శించారు. మంత్రులకు, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి తాయిలాలు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తే తిప్పికొడతామన్నారు. ఒక ఎమ్మెల్యే పైన పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడమేమిటన్నారు. నక్సలైట్లను అణిచి వేయడానికి చూపించే దూకుడు ఉద్యమకారులపై చూపిస్తే ఊరుకోమన్నారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడం ద్వారా తెలంగాణ ప్రజాప్రతినిధులను భయాందోళనకు గురి చేయాలని ప్రభుత్వం భావించిందన్నారు. పోలీసుల తీరు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించిందని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ఒక ఎమ్మెల్యేకు అవమానం జరిగితే ముఖ్యమంత్రి, స్పీకర్, హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో పోలీసులు పాలన కొనసాగుతుందా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications