తెలంగాణపై నిర్ణయం ఇప్పట్లో వెలువడుతుందా?

తెలంగాణపై నిర్ణయాన్ని కాంగ్రెసు నాయకత్వం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతోంది. వచ్చే 2014 ఎన్నికల వరకు కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేయడానికే సిద్ధపడినట్లు తెలుస్తోంది. అందుకే, ఎక్కడా నిర్ణయానికి సంబంధించిన ఉత్కంఠ లేదు. ఏ విధమైన హామీ ఇచ్చి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేస్తారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారిన విషయం. అసలు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందా, కాంగ్రెసు అధిష్టానం చేస్తుందా అనే స్పష్టత కూడా లేదు. జనవరిలోగా తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని ఇటీవల ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా తెలంగాణపై నిర్ణయానికి ఆటంకంగా కాంగ్రెసు అధిష్టాన చూపవచ్చునని అంటున్నారు. అలాగే, జనవరి 16వ తేదీన సంక్రాంతి పర్వదినం, జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం ఉంటాయి. ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. వాటి పేరు చెప్పి కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదాలు వేస్తూనే పోతుందని అంటున్నారు. తెలంగాణపై ఇటీవలి కాలంలో ఓ నిర్ణయం వస్తే అది వింత మాత్రమే అవుతుందనే వ్యాఖ్య వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications