శ్రీలక్ష్మి విచారణను తొందరగా ముగించిన సిబిఐ

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమాల కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మరోసారి శనివారం ఉదయం హాజరయ్యారు. కాగా, గాలి జనార్దన్ రెడ్డి కేసులో నాలుగో నిందితురాలైన శ్రీలక్ష్మి అరెస్టుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవల సిబిఐ తొమ్మిది గంటల పాటు శ్రీలక్ష్మిని ప్రశ్నించింది. ఆ రోజే ఆమెను సిబిఐ అరెస్టు చేస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. తాను అరెస్టు కాకుండా శ్రీలక్ష్మి తీవ్ర ప్రయత్నాలే చేశారని ప్రచారం జరుగుతోంది. కేసులో అప్రూవర్‌గా మారుతానని ఆమె చెప్పారని వార్తలు వస్తున్నాయి. శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు మాట్లాడని మరో ఐఎఎస్ అధికారి రాజగోపాల్ శుక్రవారం తప్పునంతా ఆమెపైనే వేసినట్లు వార్తలు వచ్చాయి.
ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు రావడం వల్లనే సిబిఐ ఆమె అరెస్టుపై ఇటీవల వెనక్కి తగ్గినట్లు ఓ వార్తాపత్రిక రాసింది. దాంతో పాటు శ్రీలక్ష్మిని అరెస్టు చేయడం కన్నా అప్రూవర్‌గా మార్చుకుంటే పెద్దల గుట్టు బయటపడుతుందని సిబిఐ ఆలోచనగా చెబుతున్నారు. బ్రాహ్మణి స్టీల్స్‌కు కాప్టివ్ మైన్‌గా ఖనిజాలను వాడాలనే పదం ఏ దశలో జీవో నుంచి మాయమైందో తనకు తెలియదని ఆమె అంటున్నారు. బ్రాహ్మణి స్టీల్స్‌కు కాప్టివ్ మైన్‌గా వాడడానికి అప్పటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఓబుళాపురం గనులను గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చింది. అయితే, జీవోలో ఆ పదం మాయం కావడంతో గాలి జనార్దన్ రెడ్డి ఇనుప ఖనిజాన్ని యధేచ్ఛగా ఎగుమతి చేశారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల కారణంగానే గాలి జనార్దన్ రెడ్డికి గనులను లీజుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా శ్రీలక్ష్మి సిబిఐ ముందు చెప్పినట్లు తెలుస్తోంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications