వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు చేయలేదు,నిర్దోషిగా బయటపడతా: రాజగోపాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

rajagopal
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో నాటి గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్‌కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 25వ తేది వరకు రిమాండ్ విధించింది. రాజగోపాల్ కస్టడీ సోమవారంతో ముగియడంతో అధికారులు ఆయనను సోమవారం ఉదయం ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. వాదనల అనంతరం కోర్టు ఆయన రిమాండ్ పొడిగించింది. దీంతో ఆయనను చంచలగూడ జైలుకు తరలించారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయం, చట్టాల సహాయంతో తాను ఎప్పటికైనా నిర్దోషిగా బయటపడతానని రాజగోపాల్ చంచల్ గూడ జైలు వద్ద చెప్పారు. కాగా రాజగోపాల్‌ను మరో వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాలి గనుల కేసులోని పూర్తి వివరాలు సేకరించడానికి ఆయన కస్టడీ కావాలని అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు.

English summary
Rajagopal remand extended cbi special court today till 25th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X