విజయమ్మ పిటిషన్‌పై సుప్రీంకు రామోజీ, టిడిపి నేతలు

Supreme Court
న్యూఢిల్లీ: తమ ఆస్తులపై హైకోర్టు ప్రాథమిక విచారణకు జారీ చేసిన హైకోర్టు ఆదేశాలను ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరి, సిఎం రమేష్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆస్తులతో పాటు వారి ఆస్తులపై కూడా విచారణకు హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ మేరకు హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాలను తాను సుప్రీంకోర్టులో సవాల్ చేయబోనని చంద్రబాబు నాయుడు ఆదివారం ఢిల్లీలో చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరి, పార్టీ నాయకుడు సిఎం రమేష్ వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విజయమ్మ పిటిషన్‌పై రామోజీ రావుతో పాటు తెలుగుదేశం నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి.

చంద్రబాబుకు చెప్పిన తర్వాతనే ముగ్గురు తెలుగుదేశం నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ప్రభుత్వం నుంచి తాను ఎటువంటి కాంట్రాక్టులూ పొందలేదని సుజనా చౌదరి మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను 25 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నానని, ఏ రోజు కూడా తప్పు చేయలేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణ తర్వాత పాలేవో, నీళ్లేవో తేలిపోతాయని కూడా ఆయన అన్నారు. సిబిఐ విచారణను ఎదుర్కుంటారా అని అడిగితే సిబిఐ వాళ్లు కూడా మనుషులేనని, దయ్యాలూ భూతాలూ కారని ఆయన సమాధానమిచ్చారు. వ్యక్తిగతంగా అయితే తాను సుప్రీంకోర్టుకు వెళ్లేవాడిని కానని, కంపెనీ లా బోర్డు ప్రకారం వెళ్లాల్సి వస్తోందని ఆయన అన్నారు. కాగా, వైయస్ విజయమ్మ సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+