పార్లమెంటు సమావేశాల తర్వాతనే తెలంగాణ: ఆజాద్

కేంద్ర మంత్రి అంబికా సోనీ కార్యక్రమంలో ఆజాద్ కొంత మంది మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. యుపిఎ మిత్రపక్షాలతో కూలంకషంగా చర్చించిన తర్వాత ఇతర పార్టీల అభిప్రాయాలు తెలుసుకుని, రాష్ట్రానికి చెందిన పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటవుతుందని ఆజాద్ అన్నారు. నాలుగు పార్టీలు తెలంగాణపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఇటీవల అన్నారు. ఆ నాలుగు పార్టీల్లో కాంగ్రెసు పార్టీ కూడా ఉంది. పార్లమెంటు సమావేశాల తర్వాత కాంగ్రెసు ఒక నిర్ణయానికి రావడానికి అవసరమైన కసరత్తు జరుగుతుందని ఆజాద్ మాటలను బట్టి అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications