ఇదీ జరిగింది: జగన్ 'బెదిరింపు'లపై బొత్స వివరణ

Botsa Satyanarayana
హైదరాబాద్: తన వర్గం ఎమ్మెల్యేలు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి వట్టి వసంత్ కుమార్ బెదిరించారన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు బొత్స బుధవారం వివరణ ఇచ్చారు. తాము ఎవరినీ ప్రలోభ పెట్టలేదని, ఎవరినీ బెదిరింపులకు గురి చేయలేదని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాయకరావు ఎమ్మెల్యే బాబూరావుతో తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన తారసపడినప్పుడు అదే సాన్నిహిత్యంతో ఓటు ఎవరికి వేస్తావని అడిగానని, దానికి బాబూరావు జగన్ ఉప ఎన్నికల్లో ఖర్చు అంతా భరిస్తానని చెప్పారని, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని కోరారని అలాగే చేస్తానని చెప్పారని తెలిపారు.

దానికి తాను, అయితే పాయకరావుపేటలోనే చూసుకుందామని సరదాగా నవ్వుకుంటూనే అన్నానని, ఆ తర్వాత అతను నేను పోటీ చేస్తే మీరెలా వస్తారని ప్రశ్నించారని ఇదీ మా మధ్య జరిగిన సంభాషణ అని బొత్స వివరించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. పదిహేడు మంది ఎమ్మెల్యేలు డబ్బుకు ఆశపడే జగన్ వర్గంలో చేరిపోయారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+