అగ్నిప్రమాదం మృతులు 89, పారిశ్రామికవేత్తల అరెస్టు

ఎస్‌కె తోడీ శ్రాచి గ్రూప్ చైర్మన్ కాగా ఆర్ఎస్ గోయెంకా ఏమామి గ్రూప్ చైర్మన్. ఈ ఆస్పత్రికి వారు సహ వ్యవస్థాపకులు. ఆరుగురిలో ఎస్‌కె తోడీ పోలీసు కేంద్ర కార్యాలయంలో లొంగిపోయారు. మృతుల్లో 70 మంది రోగులు, ముగ్గురు ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. మృతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రిలోని ఐసియులో ఉన్నవారే ఎక్కువగా దెబ్బ తిన్నారు. గ్యాస్ పేరుకుపోవడంతో అగ్నిప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమైంది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి, ప్రజల ఆగ్రహాన్ని చల్లబరచడానికి ఆమె ప్రయత్నించారు. మృతుల కుటుంబాలకు అస్పత్రి ఐదు లక్షల రూపాయలేసి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రభుత్వం విడిగా నష్టపరిహారాన్ని అందించనుంది.












Click it and Unblock the Notifications