గెట్ రెడీ.. సూపర్ హిట్‌కు సీక్వెల్ వచ్చేస్తోంది..!
తెలుగు ఓటీటీ రంగంలో ఒక సైలెంట్ విప్లవం.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి, నవ్వుల పండగ పండించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సేవ్ ది టైగర్స్'. భార్యాబాధితులైన ముగ్గురు మొగుళ్ల కథతో మొదలైన ఈ సిరీస్, ఇప్పుడు ఏకంగా నాలుగో సీజన్‌కు అడుగులు వేస్తోంది! ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో విడుదలైన సీజన్ 3 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి రెండు సీజన్ల తరహాలోనే మూడో సీజన్ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో, షో రన్నర్ మహి వి. రాఘవ్ అండ్ టీమ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో మెరవబోతున్నారు
పెళ్లి తర్వాత మూడు జంటల మధ్య జరిగే చిన్న చిన్న గిల్లికజ్జాలు, ఈగోల చుట్టూ తిరిగే ఈ కథకు సీజన్ 3లో ఇచ్చిన 'కాస్మిక్ ట్విస్ట్' ఒక రేంజ్‌లో కనెక్ట్ అయింది. సిరీస్‌ను సరికొత్త కోణంలోకి తీసుకెళ్లిన ఆ ట్విస్ట్, ఇప్పుడు సీజన్ 4పై అంచనాలను స్కై-హైకి తీసుకెళ్లింది. దీంతో మేకర్స్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా, మరింత గ్రాండ్‌గా సీజన్ 4ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. సీజన్ 4లో ఒక టాలీవుడ్ స్టార్ హీరో మెరవబోతున్నారు.

అసలైన ట్విస్ట్ ఉంది
ట్విస్ట్ ఏంటంటే: అసలే చిన్నపాటి ఇగోలు, భార్యలతో తగాదాలతో సతమతమయ్యే మన ముగ్గురు హీరోల (ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ) జీవితాల్లోకి ఈ స్టార్ హీరో క్యారెక్టర్ ఎలా ఎంటర్ కాబోతోంది? ఆయన పాత్ర కథను ఏ మలుపు తిప్పబోతోంది? అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఆ స్టార్ హీరోతో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ క్రేజీ హీరో ఎవరనేది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
రాబోయే ఆ స్టార్ హీరో ఎవరు?
చిన్న సిరీస్‌గా స్టార్ట్ అయి, టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ ఫ్రాంచైజీగా నిలిచిన 'సేవ్ ది టైగర్స్'.. నాలుగో సీజన్‌తో మరోసారి ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడానికి రెడీ అవుతోంది. ఈసారి బడ్జెట్ పరంగా, మేకింగ్ పరంగా మరింత గ్రాండియర్‌గా ప్లాన్ చేస్తున్నారట. మరి ఆ రాబోయే స్టార్ హీరో ఎవరు? ఈ ముగ్గురు 'టైగర్స్'ని సేవ్ చేస్తారా లేక మరింత ఇరుకున పెడతారా? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.














Click it and Unblock the Notifications