కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఈ మూడేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సోమవారం అన్నారు. జగన్‌కు ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ పని చేయదన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. జగన్ ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయాన్ని పార్టీ త్వరలో నిర్ణయిస్తుందన్నారు. ఉప ఎన్నికల్లో ఇంచార్జ్‌ల నియామకంపై సిఎంతో చర్చిస్తామన్నారు. సిఎంతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
కార్పోరేటే ఆసుపత్రుల భద్రతపై విచారణ జరిపిస్తామన్నారు. పదిహేను రోజుల్లో విచారణ జరిపి నోటీసులు అందజేస్తామన్నారు. భద్రతా చర్యలు లేకుంటే ఆ హాస్పిటల్ అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.