వైయస్ జగన్‌ది దొంగ దీక్ష, బాబుది దొంగ బాట: హరీష్

తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న వివక్షపట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడులు, వైఎస్.జగన్మోహన్‌రెడ్డిలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పైసా పెట్టుబడి పెట్టకుండా పంట విరామం ప్రకటించిన ఆంధ్రా ప్రాంతంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పంటలు నష్టపోయి నిండా మునిగినా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో సరిపెట్టుకోవాలనడం ఏం న్యాయమని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఎందుకివ్వరని ప్రశ్నించారు. కరెంటు కోతల విషయంలో కూడా ప్రభుత్వం వివక్షత కనబరుస్తున్నదని విమర్శించారు. ఆంధ్రాప్రాంతం కంటే తెలంగాణలోని గ్రామాలకు తక్కువ కరెంటు ఇస్తున్నారని చెప్పారు. రైతు పోరుబాట, రైతు దీక్షల పేరిట తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబు, జగన్‌లు ఈ విషయమై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అడిగారు. శాసనసభ సమావేశాలలో ఈ విషయం తాను అడిగితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పదని, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాట్లాడదని, అలాంటపుడు తెలంగాణ రైతుల పట్ల వారికున్న ప్రేమ ఏమిటని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications