రాజకీయం: బాబు జగన్ టూర్లపై కోదండరామ్, బాపూజీ

మంత్రుల చేతకానితనం వల్లనే తెలంగాణ ప్రజలపై పోలీసులు దౌర్జన్యాలు చేస్తున్నారని కోదండరామ్ వేరుగా నల్గొండ జిల్లాలో అన్నారు. జగన్, చంద్రబాబు ఇలా సీమాంధ్రకు చెందిన అందరు నేతలు ఒక్కటై తెలంగాణవాదం లేదని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సంపన్న వర్గాల ఆధిపత్యం వల్లే తెలంగాణ వెనుకబాటుకు గురవుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం బలమైన శక్తిగా ఎదగడంతో ప్రపంచస్థాయిలో తెలంగాణ అంశం బలపడిందన్నారు. ఉద్యమ రూపంలో విద్యార్థులు మరింత బలమైన శక్తిగా మారాలన్నారు.












Click it and Unblock the Notifications