వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటలు కాదు, బాలయ్య చేతల్లో చూపాలి: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తమ పార్టీ నాయకుడు చిరంజీవిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, హీరో బాలకృష్ణ నీచమైన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నాయని, బాలకృష్ణ మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని అనుకుంటే వాటిలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆ తర్వాత 17 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని, వాటిలో ఎక్కడి నుంచైనా బాలకృష్ణ పోటీ చేయవచ్చునని ఆయన అన్నారు. లేదంటే తిరుపతి నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, అక్కడ కూడా పోటీ చేయవచ్చునని ఆయన అన్నారు. బాలకృష్ణ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల అభిమానుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయని ఆయన అన్నారు.

సామాజిక న్యాయం కోసమే చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరారని ఆయన అన్నారు. విశాల భావనతో, జాతీయ దృక్పథంతో భారతీయుడిగా ఆలోచించి కాంగ్రెసు పార్టీలో చేరారని ఆయన అన్నారు. చిరంజీవి మాట తూలని వ్యక్తి అని, సహృదయుడని ఆయన అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో చిరంజీవి పార్టీ స్థాపించారని ఆయన అన్నారు. అయితే, పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, చంద్రబాబు తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినా గత ఎన్నికల్లో సోనియా గాంధీ నాయకత్వంపై విశ్వాసంతో, తమకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెసు పార్టీని గెలిపించారని ఆయన అన్నారు.

చిరంజీవికి గత ఎన్నికల్లో 18 శాతం ఓట్లు వచ్చాయని, అవి తక్కువేమీ కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ఒక శాతం ఓట్లు కూడా లేని కమ్యూనిస్టు పార్టీలతో, మూడు నాలుగు శాతం ఓట్లు కూడా లేని తెలంగాణ రాష్ట్ర సమితితో కాళ్లావేళ్లా పడి పొత్తు కుదుర్చుకున్నారని ఆయన అన్నారు. నిజానికి, ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ రెండో స్థానంలో ఉందని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చంద్రబాబు కలర్ టీవీల ఆఫర్ వల్లనో, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం వల్లనో తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలోకి వచ్చిందని ఆయన చెప్పారు.

చిరంజీవి పదవుల కోసం అమ్ముడుపోయారని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చిరంజీవి బేషరతుగా పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని, కాంగ్రెసు తన బాధ్యతగా గుర్తించి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇచ్చిందని, చిరంజీవికి కూడా తగిన స్థానం కల్పించిందని ఆయన అన్నారు. అజిత్ సింగ్ లాగా చిరంజీవికి వెంటనే కేంద్ర మంత్రి వర్గంలో చేరే అవకాశం ఉండిందని, కానీ చిరంజీవి అలా చేయలేదని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకులు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారనే తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శలను ఆయన ఖండించారు.

English summary
Congress MP Lagadapati Rajagopal suggested Balakrishna to contest in bypolls, instead of talking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X