ఆ మాట వైయస్ జగన్ ఎప్పుడో చెప్పారు: సబ్బం హరి

Sabbam Hari
విశాఖపట్నం: తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. సమాచార కమిషనర్ల నియామాకంతో ఆ విషయం నిజమని తేలిందని జగన్ వర్గానికి చెందిన ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఢిల్లీకి సూట్‌కేసులు పట్టుకెళ్లి పదవులు కొన్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారని, అలా కొన్నవారెవరో డిఎల్ రవీంద్రా రెడ్డి బయట పెట్టాలని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు రాజకీయ ప్రేరేపితమేనని ఆయన అన్నారు. ఎమ్మార్పీ రేట్లకు మద్యాన్ని అమ్మించడం తమ విజయమని ప్రభుత్వం అనుకుంటే పొరపాటని ఆయన అన్నారు.

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశం ఏ విధమైన ప్రయోజనం ఇవ్వదని ఆయన అన్నారు. రైల్వే బడ్జెట్ దాదాపు తుది మెరుగులు దిద్దుకున్న తర్వాత ఇప్పుడు ప్రతిపాదనలు చేయడం ఏమిటని ఆయన అడిగారు. ఏ విధమైన ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతోనే తాను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన పార్లమెంటు సభ్యుల సమావేశానికి వెళ్లలేదని ఆయన అన్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంటులో ప్రస్తావించడానికి ప్రయత్నిస్తే కాంగ్రెసు నాయకులే అడ్డుకున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+