హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సేవలో సిఎం కిరణ్, వారు కవలలు: రేవంత్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ravanth Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ బ్యాచ్, కిరణ్ బ్యాచ్ బిజీబిజీగా ఉన్నాయని, పరస్పరం ఈగ వాలకుండా చూసుకునే పనిలో తలమునకలయ్యాయని ఆయన అన్నారు. జగన్ అవినీతి వ్యవహారాలపై సిఎం కిరణ్ నోరు మెదపరని, పైగా ఆయన వ్యతిరేకులపై వేటు వేయడానికి వెనుకాడటం లేదన్నారు. చూస్తుంటే జగన్ సేవలో కిరణ్ తరిస్తున్నట్లుగా కనిపిస్తోందని, కిరణ్, జగన్ కవల పిల్లల్లా వ్యవహరిస్తున్నారని, వైఎస్ అవినీతి వారసత్వాన్ని కిరణ్ మోస్తుంటే రాజకీయ వారసత్వం కోసం జగన్ తహతహలాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంలోని, ప్రభుత్వ సంస్థల్లోని జగన్ వ్యతిరేకులను సిఎం కిరణ్ క్రమంగా సాగనంపుతున్నారని ఆరోపించారు. ఎమ్మార్ స్కాంను బయటకు తెచ్చిన ఎపిఐఐసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రమణ్యం పదవి కాలం పూర్తి కాగానే పంపించి వేశారన్నారు. జగన్‌పై న్యాయపోరాటం చేస్తున్న శంకర్‌ రావును బర్తరఫ్‌ చేశారని, అలాగే కడపలో జగన్‌పై పోటీ చేసిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శాఖకు కోత పెట్టారని ఆరోపించారు.

జగన్‌పై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ దగ్గర ఉన్న శాఖను తీసివేశారని ఆరోపించారు. సరస్వతి పవర్ సంస్థ పేరు మీద జగన్ అక్రమంగా తనకు తాను కేటాయించుకున్న సున్నపు రాయి గనులను రద్దు చేయాలన్న ప్రతిపాదన మూడు నెలలుగా సిఎం అనుమతి కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. ఓబుళాపురం గనుల వ్యవహారాల్లో జగన్ బెదిరించారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి కొడుకు కొండా రెడ్డి ఫిర్యాదు చేసినా ఆ కేసులో జగన్‌ను చేర్చలేదని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎపిఐఐసి చైర్మన్‌గా ఉన్నప్పుడే ఎమ్మార్ స్కాం జరిగినా కేసు పెట్టలేదన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వం పట్ల అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఓటు వేసినా వారి పదవులు పోకుండా కిరణ్ కాపాడుతున్నారని, ఎక్కడో స్పీకర్‌ను ఏదో ఒక మాట అన్నారని టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాం సభ్యత్వం రద్దు చేయించిన కాంగ్రెస్ నేతలు జగన్ వర్గం ఎమ్మెల్యేల జోలికి వెళ్ళకుండా ఉండటం వెనక సీఎం జోక్యం లేదా అని ప్రశ్నించారు.

కాగా, లిక్కర్ సిండికేట్ నుంచి ముడుపులు పుచ్చుకొన్నారంటూ మంత్రి మోపిదేవి వెంకట రమణపై ఎసిబి కోర్టులో నివేదిక దాఖలు చేసినా ఆయనను పదవి నుంచి సిఎం తప్పించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి తప్పు చేశారనుకొంటే ఆయనను తప్పించాలని, లేదా ఎసిబి అధికారులు మంత్రిని అన్యాయంగా బదనాం చేశారనుకుంటే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పు చేసి ఉండాలని, కాని ఎవరిపైనా చర్య తీసుకోకుండా ముఖ్యమంత్రి మౌనంగా కూర్చుంటే చాలదన్నారు.

English summary
TDP leader Revanth Reddy accused that CM Kiran Kumar Reddy protecting YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X