హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసు: వైయస్ వద్ద పనిచేసిన సిఎఎస్‌ల విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI Logo
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పనిచేసిన ప్రధాన కార్యదర్శులందరినీ విచారించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల సిబిఐ రమాకాంత్ రెడ్డిని రెండు రోజుల పాటు విచారించింది. ప్రస్తుతం విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్‌గా ఉన్న మాజీ ప్రధాన కార్యదర్సి ఎ. రఘోత్తమరావును కూడా సిబిఐ విచారణకు పిలిచింది. ఆయనను గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. మరో ఐఎఎస్ అధికారి మోహన్ కందాను కూడా విచారణకు రావాలని సిబిఐ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదుగురు సీనియర్ ఐఎఎస్ అధికారులు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. మోహన్ కందా, టికె దివాన్, హరినారాయణ, రఘోత్తమ రావు, రమాకాంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. వైయస్ హయాంలో చివరగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డిని సిబిఐ తొలుత విచారించింది. గురువారంనాడు సిబిఐ ముందు హాజరైన రఘోత్తమ రావు ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేయడానికి ముందు భూపరిపాలన శాఖ కమిషనర్‌గా పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగా, భూపరిపాలన శాఖ కమిషనర్‌గా జారీ చేసిన ఉత్తర్వులపై సిబిఐ రఘోత్తమరావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైయస్ హయాంలోని భూకేటాయింపులపై సిబిఐ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

English summary
According to news reports - CBI has decided to grill all the Chief Secretaries worked in YSR regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X