అమ్మాయి బ్లాక్‌మెయిల్: ఐఐటి తెలుగు విద్యార్థి అరెస్టు

సదరు విద్యార్థిని గత నవంబరులో తన పర్సు, ఫోన్ పోగొట్టుకుంది. అవిన సురేందర్‌కు దొరికాయి. తనను కలిస్తే ఫోన్, పర్స్ ఇస్తానని ఆమెకు సురేందర్ చెప్పాడు. ఆమె తన వస్తువులను తీసుకునేందుకు అతనిని కలుస్తానంది. ఢిల్లీ వెళ్లిన ఆమెను నిందితుడు సురేందర్ ఓ గుడికి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె తప్పించుకుంది. తనను పెళ్లి చేసుకోకుంటే మొబైల్‌లో ఉన్న తన ఫోటోలను మిస్ యూజ్ చేస్తానని ఆమెను బెదిరించాడు. అనంతరం ఆమె మొబైల్‌కు, ఈ-మెయిల్, ఫేస్‌బుక్‌లకు అసభ్యకర సందేశాలు పంపించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications