భవానీలోకి చిరంజీవిని లాగకండి: లగడపాటి ఆగ్రహం

Lagadapati Rajagopal
విజయవాడ: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిని వ్యాపార లావాదేవీల్లోకి లాగవద్దని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం మండిపడ్డారు. భవానీ ద్వీపం కాంట్రాక్టు చిరంజీవి బినామీకి చెందిందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంత్రి గంటా శ్రీనివాస రావుకు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాపారాలు ఉన్నాయని ఆయన అన్నారు. అలాంటి వ్యక్తికి కాంట్రాక్టు వస్తే దానిని చిరంజీవితో ముడిపెట్టడమేమిటని ఆయన టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న టిడిపి టెండర్లను ప్రాథమిక స్థాయిలోనే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. వారి ఆరోపణలు సమంజసం కాదన్నారు. భవానీ ద్వీపంపై టిడిపి అసత్య ప్రచారం చేస్తోందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై వేటు ఉంటుందని ఆయన చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎలా వేటు పడిందో మిగిలిన పదిహేడు మందిపై అలాగే వేటు పడుతుందన్నారు. మార్చి చివరిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విప్‌ను ఉల్లంఘించిన వారి సభ్యత్వాలు తప్పకుండా రద్దవుతాయన్నారు. 2014 ఎన్నికలలో తాను విజయవాడ నుండే పోటీ చేస్తానని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా నందిగామకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+