ఆగస్ట్ 11న ఉత్తర ఫాల్గుణిలోకి శుక్రుడు.. తులారాశితో సహా వారికి సంపదల వెల్లువ!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర సంచారం ద్వాదశ రాశుల వారి జాతకాల పైన చాలా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడిని సంపదలకు విలాసాలకు అధిపతిగా భావిస్తారు. శుక్రుడు సౌందర్యం, ప్రేమ, సుఖాలకు కారకుడు. అటువంటి శుక్రుడు ఆగస్టు 11వ తేదీన ఉత్తర పాల్గొని నక్షత్రంలోకి సంచారం చేస్తాడు.

ఆగస్టు 11న ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి శుక్రుడు

ఆగస్టు 2వ తేదీన కన్యా రాశిలోకి ప్రవేశించే శుక్రుడు, ఆపై ఆగస్టు 11న ఉత్తర ఫల్గుణి నక్షత్రం లోకి సంచారం చేయడం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, విశేష ప్రయోజనాలను ఇస్తుంది. మరి శుక్రుడి నక్షత్ర సంచారంతో లబ్ది పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Venus enters Uttara Phalguni Nakshatra on August 11 2026 These zodiac signs are lucky get wealth

మేష రాశి

మేష రాశి వారికి శుక్ర సంచారం కలిసి వస్తుంది. ఆగస్టు నెలలో శుక్రుడి నక్షత్ర సంచారం కారణంగా వీరు ఏ పని చేసిన అదృష్టం వెన్నంటే ఉంటుంది. చాలాకాలంగా బాకీ ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు మంచి వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. టెక్నికల్ రంగంలో పనిచేసే వారికి ప్రత్యేక లాభం ఉంటుంది.

తులారాశి

తులారాశి జాతకులు వృత్తి ఉద్యోగాలలో అనూహ్య పురోగతిని చూస్తారు. వివిధ మార్గాలలో ఆదాయం వస్తుంది. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించిన వారికి ఇది మంచి సమయం. పనిచేసే చోట శత్రువులు దూరమవుతారు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రేమికులకు ఇది మంచి సమయం.

కన్యారాశి

కన్య రాశి జాతకులు ఇప్పుడు కష్టపడి చేసిన పనుల ఫలితాలను అందుకుంటారు. పనిచేసే చోట కన్య రాశి వారికి విశ్వాసం పెరుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారవేత్తలకు అనూహ్య లాభాలు వస్తాయి. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయి.

శని శుక్రుల పరస్పర దృష్టితో సంసప్తక యోగం.. ఈ రాశులవారికి ఆగస్ట్ లో తిరుగేలేదు!
శని శుక్రుల పరస్పర దృష్టితో సంసప్తక యోగం.. ఈ రాశులవారికి ఆగస్ట్ లో తిరుగేలేదు!

శుక్రుడి అనుగ్రహం కోసం ఇలా చెయ్యండి

శుక్ర సంచారం వేళ శుక్రుడి అనుగ్రహం పొందాలనుకునే రాశుల వారు శుక్రవారం తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పువ్వులను భగవంతుడికి సమర్పించడం మంచిది. అంతేకాదు మరింత మెరుగైన ఫలితాల కోసం శుక్రవారం నాడు దానధర్మాలు చేస్తే మంచిది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+