ఆనంకే చెమటలు, ప్రజల కళ్లు తిరగడం ఖాయం: శోభా

 Sobha Nagi Reddy
హైదరాబాద్: బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి చెమటలు పట్టాయని ఇక సామాన్య ప్రజలకు కళ్లు తిరగటం ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ప్రజారాజ్యం శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి శుక్రవారం అన్నారు. బడ్జెట్ సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా లేదని అన్నారు. జలయజ్ఞం పేరు గానీ, ప్రాజెక్టుల పేర్లు గానీ ప్రభుత్వం ఎత్తడం లేదన్నారు. జలయజ్ఞం పూర్తైతే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందని కిరణ్ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రాధాన్యతా రంగాలని బడ్జెట్‌లో నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి, జగన్ వర్గం నేత కొణతాల రామకృష్ణ అన్నారు.

బడ్జెట్ అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లుగా ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బడ్జెట్‌లో పన్నుల భారం చూపించలేదని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. బయట విధిస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్‌లో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ఆరోగ్యం విషయంలో రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉందన్నారు. రూ.1.45 లక్షల కోట్లలో స్థానిక సంస్థలకు రూ.600 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. బడ్జెట్ ప్రజలకు పనికొచ్చేదిగా లేదని సిపిఐ నేత గూండా మల్లేషం అన్నారు. బడ్జెట్ అంకెల గారడిగా ఉందని, ప్రాధాన్యతా రంగాలకు కోత విధించారని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+