ముఖ్యమంత్రి బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన విజయలక్ష్మి

Kiran kumar Reddy
మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగింపులతో దివంగత రాజేశ్వర రెడ్డి సతీమణి విజయలక్ష్మి ఉప ఎన్నికల బరిలో నుండి తప్పుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారు. ఆమెను కిరణ్ బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. టిక్కెట్ కేటాయించనప్పటికీ పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. ఆయన హామీ కారణంగానే విజయలక్ష్మి పోటీ నుండి తప్పుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ముత్యాల ప్రకాశ్‌కు మద్దతిచ్చేందుకు ఆమె అంగీకరించారు. మహబూబ్ నగర్ సంక్షోభం చల్లారడంతో కాంగ్రెసు పార్టీ ఇక ఉప ఎన్నికల గెలుపుపై దృష్టి సారించింది.

కాగా మహబూబ్ నగర్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజేశ్వర రెడ్డి ఇటీవల మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ఆయన కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ మృతి చెందారు. కాంగ్రెసు పార్టీ తరఫున ఆయన సతీమణి విజయలక్ష్మికి టిక్కెట్ ఇవ్వాలని మొదట భావించింది. అయితే పార్టీ నేత ముత్యాల ప్రకాశ్ ఎదురు తిరిగారు. విజయలక్ష్మికి టిక్కెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు తదితర అంశాల కారణంగా చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం టిక్కెట్ విజయలక్ష్మికి కాకుండా ప్రకాశ్‌కు ఇచ్చింది. దీంతో విజయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు సిద్ధపడింది. అయితే ముఖ్యమంత్రి పలుమార్లు ఆమెతో భేటీ అయి బుజ్జగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+