ఆ వాదన తెచ్చేందుకే కొవ్వూరులో కెసిఆర్ పోటీ: బొత్స

ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విష్ణువర్ధన్‌రెడ్డి(కొల్లాపూర్), దామోదర్‌రెడ్డి(నాగర్‌కర్నూలు), రామచంద్రారెడ్డి(ఆదిలాబాద్), రాజిరెడ్డి (కామారెడ్డి)లకు పార్టీ బీ ఫారా లను గాంధీభవన్‌లో సోమవారం బొత్స అందజేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెసు అభ్యర్థులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేది తెచ్చేది జాతీయ పార్టీ అయిన కాంగ్రెసే అనే నినాదంతో ఉప ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ విజయం ఖాయమని వారు అన్నారు. ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తున్న వారంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు కాదని వారిని ప్రజలు నమ్మడం లేదన్నారు.












Click it and Unblock the Notifications