చిరునవ్వుతో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నా: త్రివేది

న్యూఢిల్లీ: తాను చిరునవ్వుతో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నానని కేంద్ర రైల్వే మంత్రి దినేష్ త్రివేది బుధవారం అన్నారు. బడ్జెట్ సామాన్యులకు అనుకూలంగా ఉంటుందని ఆయన చెప్పారు. రైల్వే ప్రగతి పైనే దేశాభివృద్ధి ఉందని ఆయన అన్నారు. భారతీయ రైల్వే బంగారం లాంటిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా దినేష్ త్రివేది మొదటిసారి రైల్వే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఛార్జీలను పెంచని రైల్వే ఈసారి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి సుంకం పేరుతో కొత్తగా పన్నులు విధించే అవకాశం ఉంది. ఈసారి ప్రత్యక్ష, పరోక్ష వడ్డింపులు ఉంటాయని అంటున్నారు.
కాగా త్వరలో జరగనున్న రాష్ట్రాల్లో పలు రైళ్లు ఆగే అవకాశం కనిపిస్తోంది. సొంత రాష్ట్ర పశ్చిమ బెంగాల్‌తో పాటు గుజరాత్ వంటి రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిపే అవకాశముంది. నూతన బడ్జెట్‌లో సాధారణ ప్రయాణీకులపై ఛార్జీల భారం ఉండకపోయినప్పటికీ ఉన్నత తరగతులపై ఛార్జీలు పెంచే అవకాశముంది. రైల్వే సర్వీసుల్లోనూ మార్పులు చేసే అవకాశముంది. కాగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు త్రివేది బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆయన ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్నారు. లోకసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత స్పీకర్ సభను 12 గంటలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications