మమతకు చుక్కలు!: రైల్వే మంత్రిని నేనే అన్న త్రివేది

శనివారం మరోసారి తృణమూల్ త్రివేది రాజీనామాను కోరింది. అయితే పార్టీ అధినేత్రి నుండి లిఖిత పూర్వక ఆదేశాలు వస్తే గానీ, మంత్రి పదవిని వదిలేదని లేదని ఆయన స్పష్టం చేశారు. మౌఖిక ఆదేశాలు పట్టించుకోనని చెప్పారు. రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది తానేనని, దానిపై చర్చకు సమాధానం కూడా తానే ఇస్తానని చెప్పారు. ప్రధాని తొలగించినా, మమత లేఖ రాసినా అప్పుడే పదవి నుండి తప్పుకుంటానని చెప్పారు. మరోవైపు తాము లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చేది లేదని తృణమూల్ అధిష్టానం తేల్చి చెప్పింది. మొత్తానికి రైలు బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యుపిఏకు షాక్ ఇవ్వాలనుకున్న మమతకు ఇప్పుడు అదే పార్టీ నేత త్రివేది రాజీనామాపై మెలికలు పెడితూ చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు దినేష్ త్రివేతి సోమవారం రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications