వైయస్సార్, జగన్ ఒక్క చెట్టు కొమ్మలే: చిరంజీవి వ్యాఖ్య

కాంగ్రెసులోనే సామాజిక న్యాయం సాధ్యమని ఆయన అన్నారు. సామాన్యులపై, పేదలపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే తాను విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశానని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రికి లేఖ రాయడాన్ని ఆయన సమర్థించుకున్నారు. అవినీతి సొంత ఇంట్లో ఉన్నా ప్రక్షాళన చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం ఉద్దేశం కూడా అదేనని ఆయన అన్నారు. అవినీతి ప్రక్షాళన అవుతుందని ఆయన అన్నారు. ఎవరి అవినీతి ఏమిటో సిబిఐ విచారణలో తేలుతుందని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీ నాయకుడేనని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కడప జిల్లా పర్యటనలో అన్నారు. అదే మాట మంత్రి రఘువీరా రెడ్డి అనంతపురంలో అన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ అవినీతితో వైయస్ రాజశేఖర రెడ్డి పేరును జత చేస్తూ చిరంజీవి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. వైయస్‌ను విమర్శించకూడదనే కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాటలను వ్యతిరేకిస్తూ చిరంజీవి మాట్లాడారు.
చిరంజీవి ఇటీవలి కాలంలో పార్టీ ముఖ్య సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో ఆయనకు విభేదాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కరెంట్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ చిరంజీవి ముఖ్యమంత్రికి లేఖ రాశారని అంటున్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి కూడా చిరంజీవి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. ఒక రకంగా కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవిని బేఖాతరు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications