కోట్లు వైయస్ జగన్‌కు, కోర్టులు మాకు: మంత్రి ధర్మాన

కాంగ్రెస్‌కు జగన్ వల్లే అవమానం జరిగిందని, అలాంటి వ్యక్తికి అధికారం ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులెవరూ ముందుకు రారని ఆయన అన్నారు. జగన్ తన పత్రిక, టీవీ చానల్ ద్వారా ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అయితే, ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారని ఆయన అన్నారు. వ్యాపారమే ధ్యేయంగా జగన్ పని చేస్తున్నారని, ప్రజల కన్నీరు తుడవడానికి, ఆకలి తీర్చడానికి 67 కంపెనీలు అవసరమా అని ఆయన అన్నారు.
గత ఎనిమిదేళ్ల కాలంలో శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని మంత్రి విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఒక్కటేనంటూ ప్రజల్లో ఉన్న అపోహను తొలగించడానికి కార్యకర్తలు మరింతగా పనిచేయాలని ఆయన కోరారు.
నరసన్నపేటలో వచ్చేనెలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలంతా కృషిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్ పార్టీలోకి వెళ్లిన నాయకులు తప్పును సరిదిద్దుకుని తిరిగి పుట్టింటికి వస్తున్నారని ధర్మాన అన్నారు.












Click it and Unblock the Notifications