ఊచకోత: మాజీ సిఆర్‌పిఎఫ్ జవానుకు ఉరిశిక్ష

తన భార్యను హత్య చేసిన ఘటనలో సాక్ష్యం చెబుతారనే భయంతో శంకరరావు తన ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన మరో ఐదుగురిని కూడా ఊచకోత కోశాడు. తలను, మొండాన్ని ఆ ఆలయంలో ఉంచి తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. భార్యను చంపిన కేసులో శిక్ష నుంచి తప్పిచుకోవడానికి అతను అలా చేశాడు.
ఆ రోజు శంకరరావు కత్తులు, బాంబులతో స్వైర విహారం చేశాడు. గ్రామస్థులను భయపెట్టాడు. అయితే, పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కోర్టులో దాదాపు ఏడాదిన్నర పాటు కేసు విచారణ సాగింది. శంకరరావు తరఫున వాదించడానికి తొలుత న్యాయవాదులు ఎవరూ రాలేదు. చివరకు ఓ న్యాయవాది అతని తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు.
శ్రీకాకుళం జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ శంకరరావు పైకోర్టుకు వెళ్తాడా, లేదా అనేది తెలియడం లేదు. అయితే, అతను పైకోర్టుకు వెళ్లాలనుకుంటే న్యాయవాదులు సహకరిస్తారా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications