అమెరికా చదువులకు స్వస్తి చెప్పే ఆలోచనలో భారతీయ విద్యార్థులు!
భారతీయ విద్యార్థులు అమెరికా చదువులకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నారా? రోజుకో రకంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు చిరాకు తెప్పిస్తున్నాయా? ఎఫ్ వన్ వీసా విద్యార్థుల పైన ట్రంప్ తీసుకురావాలి అనుకున్న లక్ష డాలర్ల ఫీజు విధానం భారతీయ విద్యార్థులలో యూఎస్ ఆశలను చంపేస్తుందా ? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
ఓపీటీ ప్రోగ్రాం పై లక్ష డాలర్ల ఫీజు.. భారతీయ విద్యార్థులకు షాక్
అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు పెద్ద షాక్ ఇచ్చే ప్రతిపాదనను ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపిటి ప్రోగ్రాం పైన లక్షడాలర్ల ఫీజు విధించాలని ట్రంప్ సర్కార్ చర్చలు జరుపుతోంది. ఇది ఇంకా అధికారికంగా అమలు చేయనప్పటికీ, ఈ ప్రతిపాదన అమలయితే భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపైన తీవ్రప్రభావం పడే అవకాశం ఉంటుంది.

ఎఫ్ 1 వీసాపై ఓపీటీలో ఉన్నవారు భారతీయులే ఎక్కువ
ఎఫ్ 1 వీసా మీద చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులు వారి చదువు పూర్తయిన తర్వాత స్టెమ్ కోర్సులకు మూడు సంవత్సరాల పాటు పని చేసుకోవచ్చు.ఇది h1b వీసా కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు ఒక బ్రిడ్జి లా ఉంటుంది. 2024 నుండి సుమారు 4 లక్షల 19 వేల మంది విదేశీ గ్రాడ్యుయేట్లు ఓ పి టి ద్వారా పనిచేస్తున్నారు. వీరిలో భారతీయులే ఎక్కువ.
ఇప్పటికే తగ్గిన యూఎస్ యూనివర్సిటీల అప్లికేషన్లు
ప్రస్తుతం ట్రంప్ తీసుకురావాలి అనుకుంటున్న ఫీజు అమలైతే తీవ్ర ప్రభావం పడేది భారతీయులపైనే.. ఇప్పటికే ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా యూనివర్సిటీలకు అంతర్జాతీయంగా వస్తున్న అప్లికేషన్లు 20 శాతం తగ్గాయి. భారతదేశం నుంచి కూడా భారీ సంఖ్యలో చదువు కోసం వెళ్లాలనుకునేవారు యూఎస్ పైన కాకుండా, ఇతర దేశాల పైన ఫోకస్ చేస్తున్నారు.
అమెరికా చదువులకు స్వస్తి చెప్పే ఆలోచనలో భారతీయ విద్యార్థులు
ఇటీవల విద్యార్థి వీసాలను నాలుగేళ్లకు పరిమితం చేయాలని నిర్ణయం, ఓ పి టి స్టూడెంట్స్ కు లక్ష డాలర్ల ఫీజు వసూలు చేసే నిర్ణయం వెరసి యు ఎస్ వైపు చూడాలంటేనే భారతీయ విద్యార్థులు చూసే పరిస్థితి కనిపించడం లేదు. తాజా కఠిన నిబంధనలతో, రోజుకో రకంగా తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా చదువులకు స్వస్తి చెప్పే ఆలోచనలో భారతీయ విద్యార్థులు తెలుస్తోంది













Click it and Unblock the Notifications