హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికలలో ఫ్యాన్ కోసం కోర్టుకెక్కిన జగన్ పార్టీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress Logo
హైదరాబాద్: త్వరలో జరగనున్న పదిహేడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలోని ఉప ఎన్నికలలో తమ పార్టీకి ఫ్యాన్ గుర్తు కేటాయించేటట్లు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించింది. ఫ్యాన్ గుర్తు కేటాయించాలంటూ తాము ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అందువల్ల వారి చర్యలను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ, తమకు ఫ్యాన్ గుర్తును కేటాయించేటట్లు ఆదేశాలు ఇవ్వాలని పార్టీ కార్యదర్శి బాజిరెడ్డి గోవర్ధన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన ప్రతివాదిగా పేర్కొన్నారు. ఎన్నికల గుర్తుల ఆర్డర్ 1968లోని 12(3) క్లాజ్ ప్రకారం ఫ్యాన్ గుర్తును కామన్ సింబల్‌గా పొందేందుకు తమ పార్టీ తరఫున ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న వారికి అర్హత ఉందని పేర్కొన్నారు.

ఇప్పటికే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి గెలిచారని, తమ పార్టీ ఎన్నికల గుర్తుగా ఫ్యాన్‌ను ప్రజలు గుర్తించుకున్నారని ఆయన తెలిపారు. తమ పార్టీపై పోటీ చేస్తున్న వారందరికీ కామన్ సింబల్‌గా ఫ్యాన్ గుర్తును కేటాయించే విషయంలో ఎన్నికల సంఘం అధికారులకు ఎటువంటి ఇబ్బందులు లేవని అన్నారు.

అయినప్పటికీ ఈ విషయంలో వారు నిర్ణయం వెలువరించడం లేదని పేర్కొన్నారు. ఒక్క తిరుపతి మినహా, మిగిలిన చోట్ల పోటీ చేస్తున్న వారంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీ అని, వారికి ఫ్యాన్ గుర్తును ఎంచుకునే హక్కు ఉందని బాజిరెడ్డి వివరించారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

English summary

 Kadapa MP YS Jaganmohan reddy's YSR Congress party went to high court on fan symbol in upcoming bypolls. Party leader Bajireddy Goverdhan Reddy filed a petition in high court for fan symbol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X