రాయదుర్గం: దీపక్ రెడ్డికి జెసి దివాకర్ రెడ్డి 'కాపు'?

ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డికి జెసి దివాకర్ రెడ్డి సహకరించే అవకాశాలు లేవు. ఇది కాంగ్రెసు విజయావకాశాలను మెండుగా దెబ్బ తీసే అవకాశాలున్నాయి. తాను కాంగ్రెసు పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. కానీ, చాలా ముందు చూపుతో దీపక్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలోకి దించుతున్నారని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది.
జెసి దివాకర్ రెడ్డి దీపక్ రెడ్డికి సహకరిస్తే పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్యనే ఉండే అవకాశాలున్నాయి. అయితే, పాటిల్ వేణుగోపాల్ రెడ్డికి తగిన బలం ఉంది. అయితే, వేణుగోపాల్ రెడ్డికి వ్యక్తిగత బలం సరిపోతుందా అనేది అనుమానంగానే ఉంది. కాగా, కాపు రామచంద్రా రెడ్డికి కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు అండదండలున్నాయి. దీంతో కాపు రామచంద్రా రెడ్డి విజయానికి దగ్గరగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అయితే, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలు పాలు కావడం వ్యతిరేకంగా పనిచేస్తుందా, సానుభూతి కురుస్తుందా అనేది చెప్పలేని వాతావరణం.
1952 నుంచి 2009 వరకు రాయదుర్గం నియోజకవర్గానికి 14 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పదిసార్లు గెలుపొందగా తెలుగుదేశం, స్వతంత్ర అభ్యర్థులు రెండేసి మార్లు గెలుపొందారు. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ తెలుగుదేశం వరుస పరాజయాలను చవిచూసింది. 1983లో జరిగిన తొలివిడత ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థే గెలుపొందడం గమనా ర్హం. ఆ తరువాత 1985,1989 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పరాభవం తప్పలే దు. 1994లో తెలుగుదేశం పార్టీ మొదటిసారి విజయం సాధించింది.
1985 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతరపున పోటీ చేసి గెలుపొందిన మునికుంటప్ప 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పక్షాన పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్‌రెడ్డిపై విజయం సాధించారు. 1999లో తెలుగుదేశం అభ్యర్థి జితేంద్రప్పపై కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి గెలుపొంది తిరిగి తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు.
2004 ఎన్నికల్లో పాటిల్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గె లుపొందారు. 2009 ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీతరపున కొత్త వ్యక్తిని రంగంలోకి దింపారు. పాటిల్‌ను పక్కనపెట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన రెడ్డి వర్గీయుడు కాపు రామచంద్రారెడ్డిని బరిలో నిలిపింది. సమీప తెలుగుదేశం అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై కాపు విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి కోసం మంత్రి రఘువీరారెడ్డితోపాటు ఆ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. తెలుగుదేశం అభ్యర్తి కోసం ఆ పార్టీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, బీకే పార్థసారధి తదితరులు ప్రచారం చేస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications