వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జయంతి: రక్తదానం చేసిన విజయమ్మ, షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - Sharmila
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. జూలై 8న వైయస్ జయంతి సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో మేకపాటి ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్ జయంతిని రైతు జయంతిగా జరపాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వైయస్‌కు సరిగా నివాళులు అర్పించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వైయస్‌ను విస్మరించినా ప్రజలు మాత్రం మర్చిపోరాన్నారు. రేపు తాము అధికారంలోకి వచ్చాక వైయస్ జయంతిని రైతు జయంతిగా జరుపుతామన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. ఆయనకు అంత బాధ ఎందుకో అర్థం కావడం లేదన్నారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరికి మద్దతివ్వాలో ఇంకా పార్టీ నిర్ణయించలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యేలు శోభా నాగి రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఘనంగా వైయస్ జయంతిని నిర్వహించారు.

కాగా పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిల, సతీమణి భారతి రెడ్డి ఇడుపులపాయలోని వైయస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ, షర్మిలలు రక్తదానం చేశారు.

English summary

 YSR Congress party honorary president and Pulivendula MLA YS Vijayamma and her daughter Sharmila donated blood on latey YS Rajasekhar Reddy jayanthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X