చిన్నారి సేఫ్: హైదరాబాద్ లేడీ టెక్కీ మృతి

Tamilnadu express accident: Hyderabad lady techie dies
హైదరాబాద్: తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో హైదరాబాదులోని కాప్రాకు చెందిన శాలిని అనే యువతి మరణించినట్లు తెలుస్తోంది. చెన్నైలోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన స్నేహితురాలి నిశ్చితార్థం కోసం కరీంనగర్ వచ్చింది. శాలిని ఆదివారం రాత్రి వరంగల్‌లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. ప్రమాద విషయం తెలియడంతో ఆమ తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదిస్తున్నారు. శాలిని నివాసం వద్ద విషాద వాతావరణం నెలకొంది.

ప్రమాదం నుంచి ఏడాదిన్నర చిన్నారి సురక్షితంగా బయటపడ్డాడు. ముఖం స్వల్పంగా కాలింది. ఇతన్ని మదురైి చెందన కౌశిక్‌గా గుర్తించారు. తండ్రి వెంకటేష్ బాబు, సోదరుడు హర్షిత్ ప్రమాదంలో మరణించినట్లు అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం నుంచి 27 మంది ప్రయాణికులు బయటపడినట్లు తెలుస్తోంది. వీరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రీలో చికిత్స పొందుతున్నవారు - రేఖ, వీణ, సాంబశివరావు, శిరీష, వెంకట కోటేశ్వర రావు వర్మ, హుసేన్, రాఘవన్, కెకె సునీల్ కుమార్, హర్షిత్, సందీప్ అగ్నిహోత్రి, అమీర్ ప్రీత్ సింగ్.

పీపుల్స్ పాలీ క్లినిక్‌లో చికిత్స పొందుతున్నవారు - విజయ కుమార్, ఖుర్షీ

నెల్లూరు జయభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు - సరళ, బంజర్ లాల్, విద్యాభాస్కర్, శ్రీనివాసులు, ప్రకాష్ సింగ్, శోభా సింగ్

బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు - మదన్‌లాల్, హరికిషన్, అనూష, తిరుపతమ్మ, సంపత్.

రాష్ట్రంలోని నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్ - 11 బోగీలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢిల్లీలో 17 మంది, భోపాల్‌లో 11 మంది, ఆగ్రాలో ముగ్గురు, నాగపూర్‌లో ఒకరు, ఝాన్సీలో ఆరుగురు, వరంగల్‌లో ఏడుగురు, విజయవాడలో 28 మంది ప్రయాణికులు ఈ బోగీలో ఎక్కారు. ప్రమాదంలో ఎస్ - 11 బోగీ పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+