ఎవరీ ధర్మాన ప్రసాద రావు, ఎలా ఎదిగారు?

1989లో శాసనసభ్యునిగా గెలుపొందిన ధర్మాన ఆ మరుసటి సంవత్సరంలోనే ఎన్ జనార్ధనరెడ్డి కేబినెట్‌లో ఓడరేవులు, క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో కూడా రెండోసారి శాసనసభ్యుడిగా గెలుపొందినప్పటికీ అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. 2004లో వైఎస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన, 2009లో కూడా రాజశేఖర్‌రెడ్డిలో రెవెన్యూ మంత్రిగానే కొనసాగారు.
వైయస్ మరణానంతరం రోశయ్య కేబినెట్‌లో కూడా అదే శాఖను నిర్వర్తించిన ధర్మాన కిరణ్ కేబినెట్‌లో ప్రస్తుతం ఆర్అండ్‌బీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాదాపు అందరూ ముఖ్యమంత్రుల కేబినెట్‌లలో కూడా ధర్మాన తనదైన శైలిలో చక్రం తిప్పారు. ఆయా కేబినెట్‌లలో కీలక వ్యక్తిగా మారారు. ఎక్కువగా వైయస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా ఆయన ఒక వెలుగు వెలిగారు.
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబుగాం సర్పంచ్‌గా రాజకీయ జీవి తం ప్రారంభించిన ధర్మాన ఆ మండలానికి ఎంపిపిగా పనిచేశారు. ఆ తరువాత జిల్లా యువజన కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో ఎన్.జనార్దనరెడ్డి కేబినెట్‌లో తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. 1996లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓడిపోతామని తెలిసి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాన్ని శిరసావహించి ఎంపీగా పోటీ చేశారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం అనంతరం ఏర్పాటైన మంత్రుల కమటీకి ధర్మాన కన్వీనరుగా వ్యవహరిస్తున్నారు.
మంత్రి ధర్మానపై ఇటీవల కాలంలోనే ఆరోపణలు చు ట్టుముట్టాయి. స్థానికంగా వివిధ అంశాలపై ఆయన నిర్ణయాలు వివాదస్పదమయ్యాయి. అయితే వీటిని ఆయన తన రాజకీయ లౌక్యం, చతురత, వాగ్దాటితో తిప్పికొడుతూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో జారీ అయిన 26 జీవోల విషయంలో తొలిసారిగా ఆయన తీవ్ర ఆరోపణలకు గురయ్యారు. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినపుడు కూడా ధర్మాన గంభీరంగా వ్యవహరించారు. జీవోలు జారీచేసినవారు నిందితులు కారని, ఆ జీవోల వలన లబ్ధి పొందినవారే దోషులుగా వుంటారని ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారు. చివరకు సీబీఐ చార్జిషీటులో ఏ5 నిందితునిగా చేర్చడంతో దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తొలిసారిగా ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications